Sridevi @60 Years : పూల రెక్కలు.. కొన్ని తేనే చుక్కలు..

Sridevi @60 Years : పూల రెక్కలు.. కొన్ని తేనే చుక్కలు..
60వ జయంతి సందర్భంగా.. శ్రీదేవికి గూగుల్ డూడిల్ నివాళి..

పూల రెక్కలు..కొని తేనె చుక్కలు.. రంగరించి చేసిన అందం ఆమెది.. ఎక్కడో శివకాశిలో పుట్టి ప్రపంచాన్ని తన అందంతో ఆకట్టుకున్న ఆ ముగ్ధ మోహన రూపం ఆమెది..అందాల అభినేత్రి శ్రీదేవి ఎన్ని భాషల్లో నటిస్తే, అన్ని భాషలవారూ ఆమెను తమ సొంత ప్రాంతానికి చెందిన అమ్మాయిగా ఆరాధిస్తున్నారు. అది ఆమె అభినయవైభవం గడించిన కీర్తికి నిదర్శనం.


అయితే ఎవరు అవునన్నా, కాదన్నా శ్రీదేవి కన్నవారు ఇద్దరూ తెలుగువారే. తండ్రి అయ్యప్పన్‌ తమిళనాట స్థిరపడ్డ తెలుగువారు. ఇక తల్లి రాజేశ్వరి తిరుపతికి చెందినవారు. మామ్‌ సినిమా విడుదలకు ముందు కొన్ని నేషనల్‌ ఛానల్స్‌ లో శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ తన మాతృభాష తెలుగేనని శ్రీదేవి నొక్కి వక్కాణించారు. శ్రీదేవి అన్ని భాషల్లోకి తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాలద్వారా శ్రీదేవి పరిచయం అయి ఉండవచ్చు, నటిగా గుర్తింపు పొంది ఉండవచ్చు. అయితే ఆమెను సూపర్‌ స్టార్‌ డమ్‌ కు చేర్చింది మాత్రం తెలుగు చిత్రాలు అని అంగీకరించక తప్పదు. శ్రీదేవి సైతం తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు కారణంగానే తనకు అంతటి గుర్తింపు లభించిందని అంగీకరించారు. శ్రీదేవి తెలుగునాట టాప్‌ హీరోస్‌ అందరితోనూ బాలనటిగానూ నటించింది, తరువాత వారి సరసనే పరువాల పాపగానూ అలరించింది. ఇలాంటి చరిత మరోనటి జీవితంలో కనపడదు. అలాగే తెలుగునాట మూడు తరాల హీరోలతోనూ సూపర్‌ హిట్స్‌ చూసిన ఘనత సైతం శ్రీదేవి సొంతం. శ్రీదేవి అత్యధిక చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించింది తెలుగు హీరో కృష్ణతోనే. ఇలా తెలుగు చిత్రాలతో శ్రీదేవి అనుబంధాన్ని చెరిపి వేయాలన్నా చెరిగిపోనిది.


హీరోయి‌న్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ ఆమెని మరచిపోని అభిమాని లేరు. అలా శ్రీదేవి 60 బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. భూలోకం మరోసారి చూస్తుందో చూడదో తెలియని సిరి శ్రీదేవి..ఈ వెన్నెల బొమ్మ 60వ పుట్టినరోజు జయంతి సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్‌గా శ్రీదేవి ఫొటోని డిస్‌ప్లే చేసింది. మంచి కలర్‌ఫుల్ లుక్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూసి అభిమానులు కన్నులపండుగ చేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story