Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్..

గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు తమ వాహనాల్లోని ఇంధనాన్ని మరింతగా ఆదా చేసుకునేందుకు కొత్త ఫీచర్ (రూట్ ఆప్షన్)ను తీసుకొస్తున్నట్టు శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం.. వాహనం ఇంజిన్‌ను అనుసరించి ఎకో ఫ్రెండ్లీ రూట్ (ఇంధనం ఖర్చు తక్కువ అయ్యే మార్గం), ఎక్కువ ఇంధనం తీసుకునే ‘ఫాస్టెస్ట్ రూట్’ను గూగుల్ మ్యాప్ చూపుతుందట. కర్బన ఉద్గారాల్ని తగ్గించటంలోనూ ఇది సహాయపడుతుందని గూగుల్ పేర్కొన్నది. భారత్ సహా ఎంపిక చేసిన దేశాల్లో సరికొత్త ఫీచర్‌తో కూడిన గూగుల్ మ్యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
తెలియని రూట్లను తెలియజెప్పే గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా (మారనున్నది. ఏదైనా ట్రిప్ మొదలుపెడితే.. ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్‌ని కూడా గూగుల్ మ్యాప్స్ సూచిస్తుంది. కెనడా, యూకేతో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ఫీచర్ పనిచేస్తోంది. హైబ్రీడ్ష ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఈ ఫీచర్ పనిచేస్తుండటం విశేషం. గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుందట. మనం ఏ కారు నడుపుతున్నామో, దాని ఇంజిన్ వివరాలను సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు, దానంతట అదే, బెస్ట్- ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్‌ని వెతికి మనకి చెబుతుంది. "ఈ ఫీచర్‌ని ఆన్ చేస్తే.. ఫ్యూయెల్ ఎఫీషియెన్సీపైనే గూగుల్ మ్యాప్స్ దృష్టిపెడుతుంది. రియల్ టైమ్ ట్రాఫిక్‌తో పాటు ఇతర అంశాలను పరిగణించదు," అని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.. తర్వాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకుని.. కిందకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్’లో ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అటుపై మీ వాహనం ఇంజిన్, ఫ్యుయల్ రకం సెలక్ట్ చేసుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్‌లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్‌లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చూపుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com