Bengaluru: కారులో కన్నా నడిస్తేనే వేగంగా వెళ్లొచ్చు..

Bengaluru: కారులో కన్నా నడిస్తేనే వేగంగా వెళ్లొచ్చు..
X
బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ దుస్థితి

బెంగళూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్.. బయటకి వెళ్లిన వాళ్లు మళ్లీ ఎప్పుడు తిరిగి ఇంటికి చేరుకుంటారో చెప్పడం కష్టమే. అంతగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌ అవుతుంటుంది. అదే వర్షకాలం అయితే ట్రాఫిక్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. 2023లో ప్రపంచంలో అత్యంత దారుణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పది నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచింది.

అదే ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండవ నగరంగా ఐటీ నగరంగా పేరుపొందింది. వేగవంతమైన పట్టణీకరణ, పేలవమైన ప్రణాళిక, పరిమిత ప్రజా రవాణా ఎంపికలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజూ నగరంలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో పాయింట్ ’ఎ‘ నుంచి ‘బి’ వరకు డ్రైవ్ చేయడం కన్నా కొన్నిసార్లు నడవడం చాలా వేగంగా ఉంటుందని గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ధృవీకరించింది

ట్విట్టర్ (X) యూజర్ ఆయుష్ సింగ్ గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుంచి కేఆర్ పురం రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి పట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే.. కారులో డ్రైవింగ్ సమయం దాదాపు 6 కిలోమీటర్ల దూరం నడవడానికి పట్టే సమయాన్ని చూపుతుంది. ఫొటో ప్రకారం.. రెండు పాయింట్ల మధ్య డ్రైవింగ్ చేయడం ఒక వ్యక్తికి 44 నిమిషాలు పడుతుంది. అయితే, నడక 42 నిమిషాలకు కొంచెం వేగంగా చూపిస్తుంది. ఈ ఫొటోను షేర్ చేసిన సింగ్.. “ఇది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది.” అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు వైరల్‌ కావడంతో 6.2 లక్షల మంది వీక్షించగా, పలువురు చమత్కారంగా కామెంట్లు పెట్టారు.

Tags

Next Story