President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బ.. పోటీకి నో అన్న లీడర్..

President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బ.. పోటీకి నో అన్న లీడర్..
President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో మరోసారి విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో మరోసారి విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్టీయేకు ధీటుగా బలమైన రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్షాల కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ నిరాకరించారు. తాను రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు.

ఈనెల 15న మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్. గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు. అయితే భేటీలోనే మమతా బెనర్జీ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ శరద్‌ పవార్ వైపు మొగ్గు చూపినా.. ఆయన మాత్రం నిలబడేదే లేదని చెప్పేశారు.

ఇక శరద్‌ పవార్ షాక్ నుంచి తేరుకోక ముందే..శనివారం విపక్ష పార్టీలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరో షాక్ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల రాశారు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ.. నా పేరును ప్రతిపాదించడం ఆనందంగా ఉందంటూనే నో చెప్పేశారు.

ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌ను బయటపడేసేందుకు నా వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు క్రియాశీల రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు ఫరూక్ అబ్దుల్లా. దాంతో రాష్ట్రపతి రేసులో వేట కొనసాగిస్తున్న విపక్షాల కూటమి రేపు మరోసారి ఢిల్లీలో సమావేశం కానుంది. ముగ్గురు కాదనడంతో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు? అనేది ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story