రాష్ట్రంలో జికా వైరస్.. హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రంలో జికా వైరస్.. హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం
X
కర్ణాటకలో జికా వైరస్‌ను గుర్తించిన ఆరోగ్య అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు రాష్ట్రంలో హైఅలెర్ట్ ను ప్రవేశపెట్టారు.

కర్ణాటకలో జికా వైరస్‌ను గుర్తించిన ఆరోగ్య అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు రాష్ట్రంలో హైఅలెర్ట్ ను ప్రవేశపెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కబళ్లాపూర్‌లోని ఓ దోమను ఆగస్టులో పరీక్షలకు పంపగా అందులో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. వైరస్‌ను గుర్తించిన తర్వాత, కర్ణాటక ఆరోగ్య శాఖ శాంపిల్‌కు చెందిన తల్కెబెట్టాకు 5 కిలోమీటర్ల పరిధిలో హెచ్చరిక జారీ చేసింది.

“రాష్ట్రవ్యాప్తంగా 100 నమూనాలను సేకరించారు. ఆరుగురు చిక్కబళ్లాపూర్‌కు చెందినవారు కాగా వారిలో ఐదుగురికి నెగెటివ్‌ వచ్చింది. ఒకటి పాజిటివ్‌ అని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎస్‌ మహేష్‌ తెలిపారు. అధిక జ్వరం ఉన్న ముగ్గురు రోగుల నమూనాలను పాథలాజికల్ విశ్లేషణ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.

జికా వైరస్ వ్యాధి సోకిన ఏడెస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ మరియు చికున్‌గున్యా వంటి అంటువ్యాధులను కూడా వ్యాప్తి చేస్తుంది. జికా వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు.

రాష్ట్రంలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్‌ ఉందో లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించారు.

వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు నివారణ చర్యలు చేపట్టారు.ఇప్పటికే ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తొలిదశలోనే వైరస్ ని నిర్మూలించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

30 మంది గర్భిణులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురి రక్త నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం బెంగళూరుకు పంపారు. తల్కెబెట్టాకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి నమూనాలు సేకరించారు. వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

Tags

Next Story