Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్..
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లే ఉన్నారని రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ అన్నారు. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయన్నారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. పైలట్లు కెప్టెన్లు పాండా, శ్రీవాస్తవ మృతి చెందినట్లు ముఖ్యమంత్రి ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

Tags

Next Story