Central Govt: వచ్చే వారం సభ ముందుకు కొత్త బిల్లులు..!

Central Govt:  వచ్చే వారం సభ ముందుకు కొత్త బిల్లులు..!
IPC, CrPc స్థానంలో కొత్త చట్టాలు..

క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుల్లో వ్యభిచారం, స్వలింగ సంపర్కాలను నేరంగా పరిగణించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రమంత్రి వర్గం వ్యతిరేకించింది. క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు హోం మంత్రి అమిత్ షాకు ప్రధాని మంత్రివర్గం మార్గం సుగమం చేసింది. వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించి జరిమానా విధించాలన్న సిఫార్సులు సుప్రీం తీర్పులకు విరుద్ధమనీ.. ఈ చర్యలు సమాజంలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని ప్రధాని కార్యాలయం అభిప్రాయపడ్డట్లు సమాచారం. 21వ శతాబ్దంలో వ్యవస్థీకృత నేరానికి నిర్వచనాల్లో మార్పులు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తే మహిళల పట్ల వివక్ష చూపినట్లేనని, మూస పద్ధతులను పెంపొందిస్తుందని సుప్రీం 2018లో తీర్పు ఇచ్చింది. అలాగే భారత సమాజంలో లింగ సమానత్వం ఉండాలని చాలా సార్లు తేల్చిచెప్పింది. దీంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీసీ, సీఆర్పీసీ, ఐఈసీ చట్టాల స్థానంలో భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత బిల్లులను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది..

బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఏండ్ల తరబడి అమలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో ఇటీవల 3 నూతన చట్టాల బిల్లులు ప్రవేశపెట్టింది. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న అనేక చట్టాలను ముఖ్యంగా మూడు కీలక చట్టాలను రద్దు చేసే దిశగా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెట్టింది. ఇందులో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)-1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)-1898 లను రద్దు చేయనున్నట్లుగా కేంద్ర హోమ్ మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారు. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో "భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023" ను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో “భారతీయ సాక్ష్యాల చట్టం 2023" ను, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో "భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023" అనే పేర్లతో కొత్త చట్టాలను తీసుకురావడానికి ఈ బిల్లు ప్రతిపాదించారు. దేశంలోని అసాంఘిక, తీవ్ర వాద, వేర్పాటువాద శక్తులను, హత్యలు, స్త్రీలపై, బాలికలపై అత్యాచారాలు, కిడ్నాప్ లు వంటి అనేక నేరాలకు కఠినమైన శిక్షలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లులో సుమారుగా 313 సవరణలు చేసినట్లుగా పేర్కొన్నారు.


Tags

Next Story