Delhi: కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం

విధ్వంసక కార్యకలాపాలకు తోడు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నపలు ఉగ్రవాద సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. జమ్ము కశ్మీర్ లోతీవ్రవాదాన్ని ప్రేరేపించడంతో, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పలు ఉగ్రసంస్థలపై ఐదేళ్లు నిషేధం విధిస్తున్నట్లు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రవాది యాసిన్ మాలిక్ కు చెందిన జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థపై ఉన్ననిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం జమ్ము కశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్ పై ఐదేళ్లు నిషేధం విధించింది. దీనికి చెందిన నాలుగు అనుబంధ సంస్థలైన JKPL ముక్తార్ అహ్మద్ వాజా, JKPL బషీర్ అహ్మద్ తోట. JKPL గులాం మొహమ్మద్ ఖాన్, JKPL అజీజ్ షేక్ వర్గాల సంస్థలపై.. ఐదేళ్లు నిషేధం విధిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతను సవాలుచేసే ఎవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారని అమిత్ షా.. హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భద్రత దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కేటాయించాల్సి ఉంటుందని.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కశ్మీర్‌లో ఎన్నికలు సాధ్యం కావన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించారన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ 2023లో ముగిసిందన్నారు.
మొత్తం 107 సీట్లలో 27 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరాయన్నారు. కానీ, అధికార యంత్రాంగం ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కావని చెప్పినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది అభ్యర్థులు ఉంటారని.. మొత్తంగా వెయ్యికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారన్నారు. ప్రతి ఒక్కరు అభ్యర్థికి బలగాలను అందించాల్సి ఉంటుందని.. ఈ సమయంలో అది సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కష్టుబడి ఉన్నామన్నారు. హింసాత్మక మణిపూర్‌లోని శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ శిబిరాల నుంచి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com