Tomatoes: టమాట ధర తగ్గించిన కేంద్రం

టమాట ధరలతో పెరిగిన వంటింటి భారాన్ని తగ్గించేందుకు కేంద్రం( Centre) మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 90రూపాయలకు కిలో విక్రయించిన టమాట( tomatoes) ధరను 80రూపాయలకు తగ్గించింది. తగ్గించిన ధర ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హోల్ సేల్ మార్కెట్ లో టమాట ధరలు( tomatoes cost) తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతనెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా టమాట ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో రెండురోజుల నుంచి రాయితీపై విక్రయాలు చేస్తోంది. ఇందుకోసం టమాటాలను ఎక్కువగా సాగుచేసే ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సేకరించి....ఎక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో రాయితీపై అమ్మకాలు ప్రారంభించింది.
రిటైల్ ధరలు భారీగా పెరిగిన ప్రాంతాల్లో రాయితీపై కేంద్రం టమాటాలు విక్రయిస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) సంస్థల్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ టమాటలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరిస్తోంది. ఈ విధంగా సేకరించే టమాటాల్ని గత నెలలో రిటైల్ ధరలు భారీగా పెరిగిన ప్రాంతాలకు సరఫరా చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com