G20 Summit : దేశాధినేతలకు వెండి పాత్రల్లో విందు..

G20 Summit : దేశాధినేతలకు  వెండి పాత్రల్లో విందు..
అతిథిదేవో భవ!

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ 20 సదస్సును ఈసారి మనదేశంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్రం.. చేసిన ఏర్పాట్లు ఔరా అనిపిస్తున్నాయి. జీ20 సదస్సుకు హాజరయ్యే వారికి ఆహారాన్ని అందించే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుంది. తద్వారా సకల సౌకర్యాలు.. ఆతిథ్యాన్ని స్వీకరించిన అతిథులు ఎన్నటికీ.. ఎప్పటికీ మరచిపోలేని విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశిష్ట అతిథులందరికీ వెండి పాత్రల్లో భోజనం వడ్డించనున్నారు. భారత్ ఆహారాన్ని వడ్డించే విధానంలో సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది. అందుకే అతిథులకు వెండి పాత్రల్లో భోజనం వడ్డించడంతోపాటు.. రకరకాల వంటలను సిద్ధం చేయనున్నారు.

భారతీయ సంప్రదాయాలు, హుందాతనం ఉట్టిపడేలా ప్రభుత్వం ఈ విధంగా బంగారం, వెండి లోహాలతో పాత్రలు సిద్ధం చేశారు. ఈ వెండి పాత్రలను జైపూర్ కంపెనీ ఐఆర్ఐఎస్ తయారు చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పాత్రలు చూస్తే వహ్వా అనాల్సిందే. హస్తకళాకారులు అహోరాత్రులు కష్టపడి ఈ పాత్రలను తయారు చేశారు. ఈ పాత్రల సెట్ ఫ్యూజన్ సొబగుల థీమ్‌పై రూపొందించారు.


2023 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన భారత్‌. అందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అగ్ర దేశాల అధినేతలు భోంచేసేందుకు అద్భుతమైన పాత్రలు తయారు చేయించింది.జీ 20 కోసం తయారు చేసిన ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత ఉందని తయారీ దారులు చెబుతున్నారు. వీటి తయారీకి ముందు వివిధ రాష్ట్రాల్లో పర్యటించామని, భారత సంస్కృతికి అద్దం పట్టేలా వీటిని తయారు చేసినట్లు తెలిపారు. దక్షిణ భారతంలో పర్యటించి అరటాకు డిజైన్‌ ఉన్న కంచాన్ని తయారు చేశారు. అలాగే జాతీయ పక్షి నెమలి ఆకృతిలో మంచినీరు సర్వ్‌ చేసే పాత్రలు రూపొందించారు.


కొన్నింటి పై పుష్పాలు, లతలను ముద్రించారు. పండ్లు అందించేందుకు నెమలి పించం ఆకృతిలో ప్లేట్‌ రెడీ చేశారు. ఓ వెండి కంచెంలో భారత జాతీయ చిహ్నం మూడు సింహాలను ముద్రించారు. అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ సెట్‌ను సిద్ధం చేశారు. ఉప్పు ట్రేలో అశోక చక్ర చిత్రం ఉండడం దీని ప్రత్యేకత. డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు, సాల్ట్ స్టాండ్, స్పూన్ ఉన్నాయి. గిన్నె, గ్లాస్, ప్లేట్‌కు రాయల్ లుక్ ఇచ్చారు.


దీనితో పాటు, ట్రేలు, ప్లేట్లలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇది కాకుండా, ఫుడ్ ప్లేట్‌లో హస్తకళల అందమైన కళాకృతి కూడా కనిపించనుంది. అతిథి దేవో భవః అనే భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా వీటిని కేంద్రం తయారు చేయించింది.

Tags

Read MoreRead Less
Next Story