కట్నం డిమాండ్ చేసిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబం

కట్నం డిమాండ్ చేసిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబం
తల వంచుకుని తాళి కట్టించుకునే రోజులు పోయాయి.. నారీ లోకం నడుం బిగిస్తోంది.

తల వంచుకుని తాళి కట్టించుకునే రోజులు పోయాయి.. నారీ లోకం నడుం బిగిస్తోంది. అన్యాయాన్ని సహించేది లేదని ఎలుగెత్తి చాటుతోంది. కట్నం డిమాండ్ చేస్తే కాళ్లా వేళ్లా పడి బతిమాలే రోజులు పోయాయి.. పెళ్లి తరువాత ఇబ్బందులు పడే బదులు తాడో పేడో తాళి కట్టకముందే నిర్ణయించేసుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. తాజాగా యుపిలోని ప్రతాప్‌గఢ్‌లో కట్నం డిమాండ్‌ చేశాడని వధువు కుటుంబం అతడిని చెట్టుకు కట్టివేసింది.

జూన్ 14న వేదికపై దండలు మార్చుకునే సమయంలో వరుడు అమర్జీత్ వర్మ వరకట్నం డిమాండ్ చేశాడు. వధువు కుటుంబం ఈ డిమాండ్‌తో అవాక్కయ్యారు అనంతరం వరుడిని, వివాహ సభ్యులను బందీలుగా పట్టుకున్నారు.

బుధవారం రాత్రి మంధాత ప్రాంతంలోని హరఖ్‌పూర్‌లోని జౌన్‌పూర్ నుంచి పెళ్లి ఊరేగింపు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడిని విడిపించి అదుపులోకి తీసుకున్నారు. “వరుడి స్నేహితులు దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇరుపక్షాల మధ్య వాదన చెలరేగడంతో వరుడు అమర్జీత్ కట్నం డిమాండ్ చేశాడు.”

Tags

Next Story