NIA Report: దావూద్‌లానే ఎదిగిన బిష్ణోయ్‌

దావూద్‌ ఇబ్రహీంలానే ఎదిగిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌.. ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు....

పంజాబీ సింగర్‌ సిధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గురించి జాతీయ దర్యాప్తు సంస్థ NIA సంచలన విషయాలు వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో సహా 16 మంది గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ కొన్ని రోజుల క్రితం చట్టవ్యతిరేక కార్యకలాపాల సవరణ చట్టం కింద కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో బిష్ణోయ్‌ గురించి కీలక విషయాలను బహిర్గతం చేసింది. 90వ దశకంలో అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం ఎదిగనట్లుగానే లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా వృద్ధి చెందిందని NIA ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత వేగంగా విస్తరించిందని NIA పేర్కొంది. ఇది అచ్చం 1990లలో డ్రగ్ కింగ్‌ పిన్ దావూద్ ఇబ్రహీం ఎదిగినట్లే ఉందని... అప్పుడు దావూద్‌ గ్రూప్‌ సాగించిన దారుణాల్లానే.. ఇప్పుడు బిష్ణోయ్‌ గ్రూప్‌ కూడా చేసిందని వెల్లడించింది. 1990లలో దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించుకున్నాడో... అలాగే తన టెర్రర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నాడని NIA తెలిపింది. దావూద్‌ ఇబ్రహీంలానే అపూర్వమైన రీతిలో బిష్ణోయ్‌ తన ఉగ్ర సామ్రాజ్యాన్ని అనతి కాలంలోనే విస్తరించాడని దర్యాప్తు సంస్థ తెలిపింది. లారెన్స్ బిష్ణోయ్ ఎదుగుదల... దావూద్‌ ఇబ్రహీం ఎదుగుదల మధ్య సారూప్యత చాలా ఉందని NIA ఛార్జిషీట్‌లో పేర్కొంది. మొదట చిన్న చిన్న నేరాలకు పాల్పడిన లారెన్స్ బిష్ణోయ్, తరువాత తన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఉత్తర భారతంలో బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికిపైగా షూటర్లు ఉన్నారుని NIA తెలిపింది. వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారే అని వివరించింది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లకు బిష్ణోయ్ గ్రూప్‌ విస్తరించినట్లు NIA తెలిపింది. సోషల్ మీడియా ద్వారా యువకులను తన గ్యాంగ్‌లోకి రిక్రూట్‌ చేసుకుంటున్న బిష్ణోయ్.. వారందరినీ కెనడా తీసుకెళ్తానని హామీ ఇస్తాడని బహిర్గతం చేసింది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ను కూడా చంపుతానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ బెదిరించాడు. బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్‌తో పాటు, సిద్ధూ మూసే వాలా మేనేజర్ షగన్‌ ప్రీత్‌ను కూడా ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ గతంలో విక్రమ్‌జిత్ సింగ్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేసినట్లు వెల్లడి అయ్యింది.

Tags

Next Story