Gujarat: ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో తాగేందుకు నీళ్లు లేవు..!

Gujarat: ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో తాగేందుకు నీళ్లు లేవు..!

గుక్కెడు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నాయి మనదేశంలో చాలా రాష్ట్రాలు.గుక్కెడు నీళ్లులేక దాహం..దాహం అంటూ జనం గోస పడు తున్నారు.అనేక రాష్ట్రాల్లో తాగునీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.ఉత్తర, మధ్య భారతంలో నీటి గోస మామూలుగా లేదు. తాగేందుకు మురికి నీరే వారికి ఆధారం..పాతాళం నుంచి నీరు తోడుకుంటున్న మహిళలను చూస్తే కంట్లో నీళ్లు తిరుగు తాయి.70 అడుగుల లోతు బావిలో నీటి చెమ్మను పైకి తెస్తున్న ఈ దృశ్యాలను చూస్తుంటే హృదయం బరువెక్కుతుంది.

గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌, ఉత్తర గుజరాత్‌, మధ్య, దక్షిణ గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.వారానికి రెండు సార్లు కూడా నీటి సరఫరా చేయడం గగనంగా మారిపోయింది. 14 జిల్లాల్లోని సుమారు 500కి పైగా గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ సరఫరా కూడా వారానికి ఒకసారే. ఇంకా తమ నీటి కష్టాలు తీరలేదంటూ 50 వేల మంది మహిళలు ఇటీవల ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు. అయినా వారి సమస్య తీరలేదు.

గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ప్లాస్టిక్‌ బిందెలు, ఆర్వో సెంటర్లు, కిలోమీటర్ల కొద్దీ నడక నిత్యం కనిపించిన దృశ్యం. మరి 75 ఏండ్ల స్వతంత్ర భారతావని పరిస్థితి? ఈ ఎండల్లో అనేక రాష్ర్టాల్లో జనం తాగేందుకు గుక్కెడు నీళ్లులేక దాహం.. దాహం.. అని అలమటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో తాగునీటి కోసం జనం నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. దేశంలో పానీపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి.

వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు తాగునీటి కోసం పిల్లాజెల్లతో కలిసి కిలోమీటర్ల మేర నడకసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బిందెలతో లోతైన బావుల్లోకి దిగి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.

Tags

Read MoreRead Less
Next Story