Gujarat:రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతులు 32 మంది

Gujarat:రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతులు  32 మంది
X
ఎండీ, మేనేజర్‌ అరెస్టు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సందర్శకులంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటు వారిని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసేలోపై పైకప్పు కూలిపోవడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తున్న ఆదేశించిన ప్రభుత్వం.. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కగా, ప్రమాద జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర హోం మంత్రితో కలిసి సీఎం భూపేంద్ర పటేల్‌ ఆదివారం ఉదయం పరిశీలించారు. అగ్రిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి చికిత్స అందించాలని ఆదేశించారు.

గుజరాత్ లోని గేమింగ్ జోన్ లో, అదేవిధంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోవడం తనను కలచివేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు. ఈ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా సహాయ కార్యక్రమాల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థించారు.

Tags

Next Story