Gujarat Flood:గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం..

Gujarat Flood:గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం..
X
28 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్

గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు.

గుజరాత్‌లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్‌కోట్‌ వరకు, జామ్‌నగర్‌ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వడోదరలోని సయాజిగంజ్ ప్రాంతం 8 అడుగుల వరకు నీటితో నిండి ఉంది. ప్రజలను రెండ్రోజుల నుంచి ఇళ్లలోనే ఉన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. అటువంటి పరిస్థితిలో.. ఆర్మీ సైనికులు దేవదూతల వలె సహాయం చేస్తున్నారు. ప్రతి ఇంటికి తాడు, బకెట్ సహాయంతో నీరు.. ఆహారం పంపిణీ చేస్తున్నారు. గుజరాత్‌లో నెలకొన్న తీవ్ర పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో బీభత్సం నెలకొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా.. వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడే పోరాటం కొనసాగుతోంది. వాతావరణ శాఖ (IMD) కూడా గుజరాత్ తో పాటు ఒడిశా, కేరళలో భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేసింది. ఇది 80 సంవత్సరాలలో భూమి పైన ఉద్భవించిన నాల్గవ తుఫానుగా పేర్కొంది. అరేబియా సముద్రంలో విధ్వంసం సృష్టించనుంది. వాతావరణ శాఖ ప్రకారం.. ఇది చాలా అరుదైన సంఘటన.

కాగా.. నేడు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ తుపాను కారణంగా ఇప్పటి వరకు ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags

Next Story