
వైద్యు నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు మీదికి తెచ్చిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కత్తి పోట్లకు గురైన ఓ యువకుడు.. ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడు గాయాలను పరీక్షించకుండా ఏవో మాత్రలు ఇచ్చి పంపేశాడు. అతడి పొట్టలో కత్తి ఉన్న విషయం కూడా వారు గుర్తించలేదు. అప్పటి నుంచి యువకుడ్ని కడుపునొప్పి వేధించడంతో పలు ఆస్పత్రులు చుట్టూ తిరిగాడు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటన గుజరాత్‌లో భరూచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అంకలేశ్వర్‌కు చెందిన అతుల్ గిరీ అనే యువకుడు ఐదేళ్ల కిందట కత్తిపోట్లకు గురయ్యాడు. స్థానిక సివిల్ ఆసుపత్రి వైద్యుడు.. బాధితుడిని సరిగ్గా పరీక్షించకుండానే ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపేశాడు. అప్పటి నుంచి అతుల్‌కు కడుపునొప్పి ప్రారంభమైంది. తీవ్రకావడంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ, అతడికి ఉపశమనం లభించలేదు. ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించాడు. ఇటీవల అతుల్ ప్రమాదానికి గురికావడంతో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అతనికి ఎక్స్‌రే తీయగా, అతని కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా ఆ కత్తిని బయటకు తీశారు. దీంతో అతుల్ ఊపిరిపీల్చుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com