Gulam Nabi Azad : సోనియా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఆజాద్..

Gulam Nabi Azad : కాంగ్రెస్ చీఫ్ సోనియాగాందీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాసేపటికే… ఆ పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. అనారోగ్య సమస్యలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆజాద్. తనకీ బాధ్యతలు ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు.
అయితే ఆజాద్‌పైకి అనారోగ్య సమస్యలని చెబుతున్నా… అధిష్టానంపై అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలిండియా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారల కమిటీలో ఉన్న తనని, కశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి తన హోదా తగ్గించారని ఆజాద్ రగిలిపోతున్నారు. మరోవైపు మరోవైపు రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగిసినా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే బాధ్యతలు అప్పగించిన కొద్దిసేపటికే రాజీనామా చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్‌గా పేరున్న ఆజాద్… పార్టీలో ఎన్నో సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించారు. కానీ రెండేళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ… సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆజాద్ కూడా ఉన్నారు. ఆజాద్ ముఖ్య అనుచరుడు గులామ్ అహ్మద్ మిర్‌ను జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పించిన కొద్ది వ్యవధిలోనే ఆయన కూడా రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండడంతో పీసీసీని సోనియా పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. ప్రచారం కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ, పబ్లికేషన్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ, ఎన్నికల కమిటీలను నియమించారు సోనియా గాంధీ. పీసీసీ చీఫ్‌గా వికార్ వసూల్ వనీని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమణ్ భల్లాను నియమించారు. అయితే తనను ప్రచార కమిటీ చీఫ్‌గా నియమించగా.. ఆజాద్ రాజీనామాలతో షాకిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com