Joe Biden: గాజా నరమేథంపై జో బైడెన్ దిగ్భ్రాంతి

Joe Biden: గాజా నరమేథంపై జో బైడెన్ దిగ్భ్రాంతి
గాజాకు భారీ సాయం ప్రకటించిన జో బైడెన్

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ ఐసిస్‌ కంటే అత్యంత దారుణంగా హమాస్‌ మిలిటెంట్లు దురాగతాలకు పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. మిడిల్‌ ఈస్ట్‌లో భీకర పోరు సాగుతున్న వేళ ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించారు. వందలాది మంది మరణాలకు కారణమైన గాజా ఆస్పత్రిపై దాడి ఇజ్రాయెల్‌ చేసిన పనిలా కనిపించడం లేదని బైడెన్‌ తెలిపారు. కష్టసమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు బైడెన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. టెల్‌అవీల్‌లో దిగిన బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు , అధ్యక్షుడు ఇసాక్‌ ఎర్జోగ్‌ స్వాగతం పలికారు.


ఆ తర్వాత ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ ఐసిస్‌ కంటే అత్యంత దారుణంగా హమాస్‌ మిలిటెంట్లు దురాగతాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి తాను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు. 1300 మందికిపైగా ప్రజలను హమాస్‌ ఉగ్ర సంస్థ వధించింది.


సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా ఇది ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడి కాదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక మరొక బృందం ఉన్నట్లు కనిపిస్తోందని నెతన్యాహూతో జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం గాజాలోని ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఘటనపై నేను చాలా బాధపడ్డాను, షాక్‌కు గురయ్యాను. నేను చూసిన దాని బట్టి అది మీరు (ఇజ్రాయెల్‌) చేసిన దాడిలా కనిపించడం లేదు. మరొకరు చేసిన దాడిలా ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు. మేము చేయాల్సిన పని చాలా ఉంది. హమాస్‌ పాలస్తీనా ప్రజలందరికీ ప్రాతినిథ్యంవహించదని బైడెన్‌ అన్నారు. అమెరికన్లు అంతా ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నట్లు భరోసా ఇచ్చారు. కష్టసమయంలో అండగా నిలిచిన జోబైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ కృతజ్ఞతలు తెలిపారు.





Tags

Read MoreRead Less
Next Story