'హ్యాపీ బర్త్‌డే పాపా': సూసైడ్ నోట్‌లో కోటా కోచింగ్ సెంటర్ విద్యార్థి

హ్యాపీ బర్త్‌డే పాపా: సూసైడ్ నోట్‌లో కోటా కోచింగ్ సెంటర్ విద్యార్థి
X
ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో ఇద్దరు నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆ తరువాతి వరుసలో నేనుంటాను అని చెప్పాడు..

ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో ఇద్దరు నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆ తరువాతి వరుసలో నేనుంటాను అని చెప్పాడు.. కానీ అతడి మాటలెవరూ సీరియస్ గా తీసుకోలేదు.. ఇప్పుడు అది నిజమైంది. తన సూసైడ్ నోట్‌లో, తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని పద్దెనిమిదేళ్ల మంజోత్ సింగ్ పేర్కొన్నాడు.

మంజోత్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక నోట్‌ను రాశాడు. నోట్‌లో, యువకుడు "క్షమించండి" అని వ్రాసాడు. తన చర్యకు ఎవరూ బాద్యులు కారు.. "నేను నా ఇష్టానుసారం చేశాను. కాబట్టి, దయచేసి నా స్నేహితులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు" అని ఒక నోట్‌లో రాశాడు."హ్యాపీ బర్త్ డే పాపా" అని గోడపై అతికించిన మరో నోట్ రాశాడు.

మంజోత్ తెలివైన విద్యార్థి అని, సరదాగా ఉంటాడని, ప్రేమించే స్వభావం కలవాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతను 12వ తరగతి పరీక్షలలో 93 శాతం మార్కులు సాధించాడు.ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన మంజోత్ సింగ్ మెడికల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతను ఏప్రిల్‌లో కోటాకు వచ్చి నీట్‌కు సిద్ధం కావడానికి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు.

విద్యార్థి తన ముగ్గురు సహచరులతో కలిసి కోటకు వచ్చాడు. వారు ఒకే హాస్టల్‌లో వేర్వేరు గదులలో ఉంటున్నారు.గురువారం ఉదయం తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మంజోత్ మృతదేహం కనిపించింది. అతడిని ఆ విధంగా చూసిన స్నేహితులు దిగ్రభాంతికి గురయ్యారు. వెంటనే హాస్టల్ అధికారులకు తెలియజేశారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లలేదని, విద్యార్థి కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి చూస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారి తెలిపారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో ఆత్మహత్య చేసుకున్న 19వ విద్యార్థి మంజోత్. ప్రస్తుతం నగరంలోని వివిధ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. గతేడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనల్లో కనీసం 15 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story