తీసుకున్న అప్పు తీర్చే మార్గం లేక.. కొడుకుని అమ్మకానికి..

తీసుకున్న అప్పు తీర్చే మార్గం లేక.. కొడుకుని అమ్మకానికి..
అరకొర బతుకులు.. అప్పు చేయక తప్పని పరిస్థితి.. తీసుకున్నప్పుడు బావున్నా తీర్చే మార్గం దొరక్క తలపట్టుకున్నారు దంపతులు..

అరకొర బతుకులు.. అప్పు చేయక తప్పని పరిస్థితి.. తీసుకున్నప్పుడు బావున్నా తీర్చే మార్గం దొరక్క తలపట్టుకున్నారు దంపతులు.. కళ్ల ముందు కొడుకు కనపడేసరికి అతడినే అమ్మకానికి పెట్టారు.. అప్పుల ఊబి నుంచి బయటపడాలనుకున్నారు. అందుకే అందరూ నడిచే మార్గంలో కొడుకుని కూర్చోబెట్టి "నా కొడుకు అమ్మకానికి ఉన్నాడు, నేను అతన్ని అమ్మాలనుకుంటున్నాను" అని రాసి ఉన్న బోర్డుని మెడలో తగిలించుకున్నాడు తండ్రి.

అలీఘర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే ఇ-రిక్షా డ్రైవర్‌ వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గడువు ముగియడంతో అతడు చెల్లించమని వేధించాడు. రాజ్‌కుమార్ రూ. ఆస్తి కొనుగోలు కోసం చంద్రపాల్ సింగ్ అనే వ్యక్తి నుంచి 50,000లు వడ్డీకి తీసుకున్నాడు. గడువు ముగిసిన తరువాత వడ్డీ వ్యాపారి డబ్బులు అడిగాడు. కానీ రాజ్ కుమార్ దగ్గర అంత డబ్బు లేదు. అతడి అమాయకత్వాన్ని పసిగట్టిన వడ్డీ వ్యాపారి అతడు కొనుగోలు జేసిన ఆస్థిని కాజేసి ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉందని చెప్పాడు. దీని కారణంగా రాజ్‌కుమార్ తన డబ్బు మరియు ఆస్తి రెండింటినీ కోల్పోయాడు.

వడ్డీ వ్యాపారికి డబ్బు కట్టేందుకు మరో మార్గం లేక అలీగఢ్‌లోని రోడ్‌వేస్ బస్టాండ్ వద్ద తన బిడ్డను బేరానికి పెట్టాడు. రూ.6 నుంచి రూ.8 లక్షలకు విక్రయిస్తానని అడిగిన వారికి చెప్పాడు. “వడ్డీదారుడు నా పిల్లల ముందు నన్ను తరచుగా వేధించేవాడు, అవమానించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. నా కుటుంబాన్ని పోషించే ఏకైక సాధనమైన నా ఇ-రిక్షా కూడా తీసుకున్నాడు. నేను న్యాయం కోసం చాలా రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శిస్తున్నాను. కానీ నా గోడు వినేవారు ఎవరూ లేరు అక్కడ. దాంతో ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు, ”అని రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

తాను ఇప్పటికే వడ్డీ వ్యాపారికి రూ. 6,000 తిరిగి చెల్లించానని, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. అలీగఢ్ పోలీసులు మధ్యవర్తిత్వం వహించి ఇరుపక్షాల అంగీకారంతో సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ UP ప్రభుత్వాన్ని విమర్శించారు. “ఒక తండ్రి తన కొడుకును అమ్మవలసిన దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఎవరైనా ప్రభుత్వాన్ని మేల్కొలపాలి అని X లో పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story