ఉధృతం అవుతున్న హరియానా రైతుల పోరాటం

పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటం ఉధృతం అవుతోంది. హర్యానాలోని కురుక్షేత్రలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు . కనీస మద్దతు ధరను స్వల్పంగా పెంచుతూ ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు. ఈసారి ఉద్యమంలో హర్యానా రైతులు ముందున్నారు . గత కొన్ని రోజుల నుంచి రైతులు వివిధ ప్రాంతాల నుంచి కురుక్షేత్రకు చేరుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసుల బందోబస్తు పెంచారు. ఎక్కడికి అక్కడ రైతులను నిలువరించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నిన్న రాత్రి రైతులు బస చేసిన టెంట్లలోకి పోలీసులు చొరబడ్డారు. తమను ఎందుకు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ పోలీసులపై మండిపడుతున్నారు రైతులు . కనీస మద్దతు ధరల కోసం తాము చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని... అయితే చట్టం తేవడంలో జాప్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. కనీస మద్దతు ధరలపై కేంద్రంచ ట్టం తెచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com