రోడ్డెక్కిన.. హర్యానా రైతులు

హర్యానా రైతులు రోడ్డెక్కారు. పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్చేస్తూ కురుక్షేత్రలో హర్యానా- ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కురుక్షేత్ర జిల్లా పిప్లిలో వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్లతో ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హర్యానా రైతుల ఆందోళనకు పంజాబ్, యూపీ రైతులు మద్దతు పలికారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.
రైతుల ఆందోళనకు రెజ్లర్ భజరంగ్ పూనియా, రైతు నేత రాకేశ్ తికాయత్ మద్దతు పలికారు. ఆందోళనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com