Model Murder: మోడల్ శీతల్‌ను చంపింది బాయ్‌ఫ్రెండ్ ?

హర్యానా మోడల్ శీతల్ చౌదరి మర్డర్ కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కెనాల్‌లో శీతల్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఆమె గొంతు కోసి ఉన్నట్లు గుర్తించారు. శీతల్‌ను తానే చంపినట్లు ఆమె బాయ్‌ప్రెండ్ అంగీకరించాడు. ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సునీల్ భౌతికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా దాడి చేసి, కత్తితో పొడిచిన తర్వాత శీతల్ బాడీని కెనాల్‌లో పడేశాడు. పానిపట్ ఆస్పత్రిలో సునీల్ చికిత్స చేసుకున్నాడు. శీతల్‌ను మర్డర్ చేసిన అతను.. దాన్ని ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
పానిపట్ సమీపంలోని అహర్ గ్రామంలో ఓ వీడియో ఆల్బమ్ సూట్ కోసం శీతల్ అక్కడకు చేరుకున్నది. రాత్రి పదిన్నరకు గర్ల్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు సునీల్ అక్కడకు చేరుకున్నాడు. ఆమెను కారులో తీసుకెళ్లాడతను. తాగిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. రాత్రి ఒంటి గంటన్నరకు శీతల్ తన సోదరికి వీడియో కాల్ చేసింది. సునీల్‌ను తనను కొడుతున్నట్లు చెప్పింది. ఫోన్ స్విచాఫ్ కావడంతో శీతల్‌ను నేహా చేరుకోలేకపోయింది.
శీతల్‌ను చంపిన సునీళ్.. ఆ తర్వాత కారును కెనాల్‌లో పడేశాడు. తొలుత హర్యానా పోలీసులు సునీల్ కారును కెనాల్‌లో గుర్తించారు. కానీ అక్కడ శీతల్ ఆనవాళ్లు చిక్కలేదు. తన కారు కెనాల్‌లో పడిందని చెప్పిన సునీల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. శీతల్ నీటిలో మునిపోగా, సునీల్ తప్పించుకున్నాడు. టట్టూల ఆధారంగా శీతల్ మృతదేహాన్ని గుర్తించారు. చేయి, ఛాతిపై టట్టూలు ఉన్నాయి. శీతల్ శరీరంపై అనేక కత్తిపోట్లు కూడా ఉన్నాయి.
కెనాల్‌లో పడేసిన శీతల్ మృతదేహం.. పానిపట్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖరఖోడాకు కొట్టుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ద్వారా శీతల్‌ను హత్య చేసినట్లు సునీల్ అంగీకరించాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. ఎందుకు మర్డర్ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు.
గతంలో సునీల్ హోటల్‌లో శీతల్ పనిచేసింది. ఆరేళ్లుగా ఆ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది. మ్యారేజ్ కోసం శీతల్‌కు సునీల్ ప్రపోజ్ చేశాడు. కానీ ఇద్దరు పిల్లల తండ్రి అని తెలుసుకుని ఆ ఆఫర్‌ను శీతల్ కొట్టిపారేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com