ఉద్యోగులకు ఫార్మా కంపెనీ దీపావళి కానుక..

ఉద్యోగులకు ఫార్మా కంపెనీ దీపావళి కానుక..
హర్యానా ఫార్మా కంపెనీ దీపావళి రోజున ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వాలని తలచింది.

దీపావళి రోజున ఫార్మా కంపెనీ యజమాని తన ఉద్యోగులను సర్ ఫ్రైజ్ చేయాలనుకుంది. వారి పనితీరును బట్టి వారికి కార్లను బహుమతిగా అందివ్వనుంది.

హర్యానాలోని పంచకుల కేంద్రంగా ఉన్న ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అధిపతి తన ఉద్యోగులకు దీపావళి కానుకగా - సరికొత్త టాటా పంచ్ కార్లను అందించి ఆశ్చర్యపరిచారు. భాటియా ఆఫీస్ హెల్పర్‌తో సహా 12 మంది ఉద్యోగులకు వ్యక్తిగతంగా కారు కీను అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాటియా మీడియాతో మాట్లాడుతూ, తన సిబ్బంది యొక్క అంకితభావం, కృషికి తాను చాలా ముగ్ధుడయ్యానని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో వారికి ఈ ప్రత్యేక బహుమతిని అందించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

భాటియా లింక్డ్‌ఇన్ పేజీలో ఈ సంతోషకరమైన వీడియోని పంచుకున్నారు. ఉద్యోగులు నిరంతరంగా కంపెనీ పట్ల విధేయతను కనబరుస్తున్నారని, కంపెనీ వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నారని ఆయన విలేకరులతో అన్నారు.

మరొక వీడియోలో, భాటియా తన ఉద్యోగులను తమ స్వంత కంపెనీగా భావించి తమ ఉద్యోగులు స్థిరంగా ఉండి కంపెనీ పురోగతికి సహాయం చేస్తున్నందుకు వారిని "మా స్టార్స్" అని భాటియా ప్రశంసించారు.

నెల రోజుల క్రితమే కార్లను బహుమతిగా ఇచ్చినప్పటికీ, ఈ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఈ వార్త వైరల్ అవడం యాదృచ్చికంగా జరిగిందని, ఎందుకంటే దీనిని తాను పబ్లిసిటీ చేయాలని అనుకోలేదని పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఉదార ​​బహుమతికి ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. మిట్స్‌కార్ట్‌లోని సీనియర్ ఉద్యోగి శిల్పా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఎనిమిదేళ్ల క్రితం, నేను చేరినప్పుడు, సార్ తన ఉద్యోగులందరికీ కారు ఇవ్వాలనే తన కలను పంచుకున్నారు. ఈ రోజు, అతను ఆ కలను నిజం చేశారు. దాంతో మా ఆనందానికి అవధులు లేవు అని ఆమె పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story