Haryana: ఆవులని స్మగ్లింగ్ చేస్తున్నారని తప్పుగా భావించి విద్యార్థి కాల్చివేత..

Haryana: ఆవులని స్మగ్లింగ్ చేస్తున్నారని తప్పుగా భావించి విద్యార్థి కాల్చివేత..
X
హర్యానాలో దారుణం..

హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని గో సంర‌క్ష‌కులు కాల్చి చంపారు. గోవుల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆ స్టూడెంట్‌పై అటాక్‌ చేశారు. ఆగ‌స్టు 23వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో గోసంర‌క్ష‌ణ గ్రూపున‌కు చెందిన అయిదుగుర్ని అరెస్టు చేశారు. నిందితుల‌ను అనిల్ కౌశిక్‌, వ‌రున్‌, కృష్ణ‌, ఆదేశ్‌, సౌర‌భ్‌గా గుర్తించారు. బాధితుడిని ఆర్య‌న్ మిశ్రాగా గుర్తించారు. మిత్రులు శాంకీ, హ‌ర్షిత్‌తో వెళ్తున్న ఆర్య‌న్‌ను గోవులను స్మ‌గ్లింగ్ చేసే వ్య‌క్తులుగా భావించి నిందితులు వెంట‌బ‌డ్డారు. సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. హ‌ర్యానాలోని ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

రెనాల్ట్ డ‌స్ట‌ర్‌, టొయోటా ఫార్చూన‌ర్‌లో కొంద‌రు ఆవుల‌ను స్మ‌గ్లింగ్ చేసేవాళ్లు రెక్కీ వేస్తున్న‌ట్లు గో సంర‌క్ష‌కుల‌కు స‌మాచారం అందింది. స్మ‌గ్ల‌ర్ల కోసం వెతుకుతున్న స‌మ‌యంలో.. విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న డ‌స్ట‌ర్ కారును పటేల్ చౌక్ వ‌ద్ద గుర్తించారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న హ‌ర్షిత్ కారును ఆప‌లేదు. అయితే నిందితులు ఆ స‌మ‌యంలో కాల్పులు జ‌రిపాడు. ముందు సీటులో కూర్చున్న ఆర్య‌న్‌కు బుల్లెట్ త‌గిలింది. కారు ఆగిన త‌ర్వాత కూడా ఆర్య‌న్‌ను మ‌రోసారి నిందితులు షూట్ చేశారు.

కారులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు గుర్తించిన నిందితులు అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఆర్య‌న్‌ను ఆస్ప‌త్రిగా తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండాపోయింది. నిందితులు వాడిన వెప‌న్ అక్ర‌మ‌మైంద‌ని తేలింది. ప్ర‌స్తుతం వాళ్లు పోలీసు క‌స్ట‌డీలో ఉన్నారు. ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

Tags

Next Story