ప్రియాంకగాంధీకి క్షమాపణ చెప్పిన పోలీస్ అధికారులు

ప్రియాంకగాంధీకి క్షమాపణ చెప్పిన పోలీస్ అధికారులు
హాత్రాస్ బాధితురాలి కుటుంబాన్నిపరామర్శించడానికి , సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్ల కొందరు..

హాత్రాస్ బాధితురాలి కుటుంబాన్నిపరామర్శించడానికి , సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్ల కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రతినిధులను గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.. దాంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో ఓ పోలీసు అధికారి ప్రియాంక చేయి పట్టుకుని బలవంతంగా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దీంతో ప్రియాంక, రాహుల్ గాంధీలకు యుపి పోలీసులు క్షమాపణలు చెప్పారు.

అంతేకాదు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా ప్రియాంక ఆదివారం హత్రాస్ సంఘటన బాధితురాలి కుటుంబాన్ని కలుసుకుని, జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) ను తొలగించాలని, ఈ విషయంలో అతని పాత్రపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత యుపి పోలీసులు ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇదిలావుంటే ప్రియాంకపై అనుచిత ప్రవర్తన పట్ల బీజేపీ మహిళా నేత ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం? అని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా కిషోర్‌ వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story