ISRO Chief : నా పుస్తకంలో ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు: సోమనాథ్‌

ISRO Chief : నా పుస్తకంలో ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు:  సోమనాథ్‌
ఎవరినీ టార్గెట్ చేయలేదన్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్. సోమనాథ్ ‘నిలవు కుడిచ సింహంగళ్’ (వెన్నెల తాగుతున్న సింహం) పేరిట తన ఆత్మకథ రాసుకున్న విషయం తెలిసిందే. . సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎలా పురోగమించిందీ సోమనాథ్ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ముఖ్యంగా ఉద్యోగజీవితంలో తనకు ఎదురైన సవాళ్లను కూడా ఆయన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ చీఫ్ కే శివన్‌ను ఎస్.సోమనాథ్ తన పుస్తకంలో టార్గెట్ చేశారన్న ప్రచారం అకస్మాత్తుగా మొదలవడంతో ఆయన ఈ విషయమై తాజాగా స్పష్టతనిచ్చారు.

ఇస్రో అనే కాదు ఏ సంస్థలోనైనా ఉన్నత స్థానానికి చేరుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ సవాళ్లు ఎదుర్కొంటారని, తనకూ అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ‘‘అయితే, నేను ఎవర్నీ ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోలేదు. కీలక స్థానాల్లో ఉన్న వారు సాధారణంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు ఒకరి కంటే ఎక్కువ మంది అర్హులు ఉండొచ్చు. ఈ అంశాన్నే నేను వెలికితీసే ప్రయత్నం చేశాను. అంతేకానీ, ఎవరినీ టార్గెట్ చేయలేదు’’ అని అన్నారు.


2018లో ఇస్రో చైర్మెన్ ప‌ద‌వి నుంచి ఏఎస్ కిర‌ణ్ కుమార్ రిటైర్ అయిన త‌ర్వాత ఆ పోస్టు ఖాళీ అయ్యింద‌ని, దాని కోసం శివ‌న్‌తో పాటు త‌న పేరును కూడా షార్ట్‌లిస్టు చేసిన‌ట్లు సోమ‌నాథ్ తెలిపారు. ఇస్రో చైర్మెన్‌గా శివ‌న్ నియ‌మితుడైనా.. విక్ర‌మ్ సారాబాయ్ స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగార‌ని, అయితే ఆ పోస్టు త‌న‌కు ఇవ్వాల‌ని పోరాడినా.. శివ‌న్ త‌ప్పుకోలేద‌న్నారు. కానీ ఆరునెల‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత ఆ స్పేస్ సెంట‌ర్ మాజీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఎన్ సురేశ్ జోక్యంతో విక్ర‌మ్ సారాబాయ్ డైరెక్ట‌ర్‌గా సోమ‌నాథ్ బాధ్య‌త‌లు ద‌క్కించుకున్నారు.

ఇస్రో చైర్మెన్‌గా మూడేళ్ల ప‌ద‌వీకాలం ముగిస‌న త‌ర్వాత కూడా శివ‌న్ త‌న పోస్టు ఎక్స్‌టెన్ష‌న్ కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లు సోమ‌నాథ్ ఆరోపించారు. చంద్ర‌యాన్ 2 మూన్ ల్యాండింగ్ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌కుండా అడ్డుకున్నార‌ని సోమ‌నాథ్ త‌న బుక్‌లో తెలిపారు. చంద్ర‌యాన్‌2 ల్యాండింగ్ గురించి కూడా శివ‌న్ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, నిజానికి అది సాఫ్ట్‌వేర్ లోపం వ‌ల్లే ల్యాండ్ కాలేద‌ని, ల్యాండ‌ర్‌తో కాంటాక్టు కాలేద‌న్న శివ‌న్ వాద‌న క‌రెక్టు కాద‌న్నారు.

సవాళ్లను స్వీకరిస్తూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్లేలా ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకే తాను ఈ పుస్తకం రాశానని ఆయన స్పష్టం చేశారు. ఎవరినో విమర్శించాలనేది తన లక్ష్యం కాదని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story