The Trial Review: కాజోల్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే

The Trial Review: కాజోల్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే
మెప్పించే న్యాయ పోరాటం

బాలీవుడ్ ప్రముఖ నటి, హీరో అజయ్ దేవగన్ భార్య కాజోల్ కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాజోల్ నటించిన తొలి పూర్తి స్థాయి వెబ్ సిరీస్ ఇది. కాజోల్ నటన ఎప్పటిలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

కొద్ది రోజుల క్రితమే లస్ట్ స్టోరీస్ తో అలరించిన కాజోల్ తో లీగల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగు తో సహా ఏడు భాషల్లో విడుదలైంది. హైకోర్టు అడిషనల్ జడ్జిగా చేసిన భర్త ( బెంగాలీ నటుడు జిస్సు సేన్‌గుప్తా ) లైంగిక అవినీతి ఆరోపణలతో జైలు పాలవుతాడు. దీంతో కుటుంబ బాధ్యతను మోయాల్సి వచ్చిన నోయనికాసేన్ గుప్తా ( కాజోల్ ) మరోసారి లాయర్ గా తన ప్రొఫెషన్ను మొదలు పెడుతుంది. మరి తన అనుభవంతో నోయనిక భర్తను బయటకు తీసుకు రాగలదా అసలు ఆమె భర్త నిజంగానే తప్పు చేశాడా, లేదా ఎవరన్నా ఇరికించారా అన్న విషయం చూసి తెలుసుకోవాల్సిందే.


అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా దీనిని రూపొందించారు. మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. ఎలాంటి తాత్సారం లేకుండా తొలి ఎపిసోడ్ ప్రారంభ సన్నివేశం నుంచి సీరియస్గా కథని మొదలుపెట్టేసారు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నారు. 8 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ నడివి 40 నిమిషాలకు పైగా ఉండటంతో ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టే. ఇక కథకు అవసరం లేని పాయింట్ల మీద కూడా కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం మరింతగా విసుగెత్తిస్తుంది. కాస్త నడివి తగ్గించుకొని ఉంటే ఈ సీరీస్ ప్రేక్షకులని ఇంకా బాగా మెప్పించేది. అయితే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, న్యాయవ్యవస్థలో నెపోటిజం ఎలా ఉంటుంది వంటి అనేక అంశాలను దర్శకుడు స్పృశించారు.


మొత్తానికి ఇందులో కాజల్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన ప్రదర్శించగా, రాజీవ్ సేన్గుప్తగా జిషు పర్వాలేదు అనిపిస్తారు. ఇతర పాత్రలు వారి పరిధి మేరకు నటించాయి. నేపథ్య సంగీతము సినిమాటోగ్రఫీ కూడా బావుంది. కొన్ని డైలాగ్స్ మనల్ని ఆలోచింపచేస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ వెబ్ సిరీస్ మరింత బాగుండేది.

Tags

Read MoreRead Less
Next Story