నిప్పుల కుంపటిలా ఢిల్లీ

నిప్పుల కుంపటిలా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ నిప్పుల కొలిమిగా మారింది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

దేశ రాజధాని ఢిల్లీ నిప్పుల కొలిమిగా మారింది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత రెండు రోజులుగా రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story