Heavy Rain : ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి, నగరంలో ఉష్ణోగ్రత తగ్గింది. దక్షిణ ఢిల్లీ, నోయిడాలోని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. అకాల జల్లులు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించాయని అంటున్నారు ఢిల్లీ ప్రజలు.
కరవాల్ నగర్, దిల్షాద్ గార్డెన్, సీమాపురి, షహద్ర, ITO, పాలం, సఫ్దర్‌జంగ్, లోడి రోడ్, ఐజిఐ ఎయిర్‌పోర్ట్‌తో సహా ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం కురిసింది. రానున్న రోజుల్లో ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. డిఫెన్స్ కాలనీ, లజ్‌పత్ నగర్, కల్కాజీ తర్వాతి కొన్ని గంటల్లో మరిన్ని జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) 7-రోజుల సూచన ప్రకారం, ఢిల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రానున్న కొద్దిరోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 27, 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com