Heavy rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యంత చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడు కావడంతో… భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
ఇక భాగ్యనగరాన్ని ముసురు వదలడంలేదు ఉదయం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుందడా వర్షం కురుస్తోంది. ఉదయం ఆఫీస్‌లకు, సూళ్లకు వెళ్లే సమయంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. మరోవైపు నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేని ముసురుతో.. మెట్రో రైల్లో ప్రయాణికులు పోటెత్తారు. దీంతో మెట్రో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వర్షపు నీరంతా మూసి నదికి భారీగా వరదల వచ్చి చేరుతోంది. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పలు వాగులు, వంకల నుంచి వచ్చే వరదంతా మూసి నదిలోకి చేరడంతో నల్గొండ జిల్లా పరిధిలోని మూసి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది. ముంబయి నగరంతోపాటు మహారాష్ట్రలోని పలు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ముంబై, థానే, పాల్‌ఘర్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షపాతం హెచ్చరికల జారీతో ప్రజలు బీచ్‌లను సందర్శించడాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com