Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..
X
By - Sai Gnan |9 Oct 2022 5:00 PM IST
Delhi Rains : ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి
Delhi Rains : ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత దశాబ్దకాలంలో ఢిల్లీలో అక్టోబర్‌లో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురలేదని చెబుతున్నారు అధికారులు. 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఇక ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com