ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగించినట్లైంది.

వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగించినట్లైంది. భారత వాతావరణ శాఖ (IMD) గురువారం పంజాబ్, హర్యానా మరియు ఉత్తర రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మే 26 వరకు IMD అనేక రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిక్కిం, ఈశాన్య భారతదేశం, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, అంతర్గత తమిళనాడు మరియు దక్షిణ కర్ణాటకలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, లక్షద్వీప్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

బెంగళూరులో రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు భీభత్సాన్ని సృష్టించాయి. ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 52 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చెట్లు కూలడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోగా, ఉరుములు, మెరుపులతో వాన నీటిలో మునిగి మరి కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, హార్ద్వార్, టెహ్రీ, పౌరి జిల్లాల్లో వడగళ్లతో కూడిన ఉరుములు, మెరుపులు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలోని మిగిలిన జిల్లాల్లో కూడా వడగళ్ళు, మెరుపులతో కూడిన ఉరుములు, తీవ్రమైన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

"ప్రజలు సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని, ఉరుములు సంభవించినప్పుడు బయటకు రాకుండా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్ జిల్లాలోని డెహ్రాడూన్, హర్ద్వార్, పౌరి, నైనిటాల్ మరియు ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో చెట్లు కూలా గృహాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కేదార్‌నాథ్ ధామ్‌తో సహా రుద్రప్రయాగ్‌లో గత రాత్రి నుండి వాతావరణం అనుకూలంగా లేదు. వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బద్రీనాథ్‌లో రానున్న 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story