HIMACHAL PRADESH: హిమాచల్ ప్రదేశ్‌‌లో రెడ్ అలెర్ట్

HIMACHAL PRADESH: హిమాచల్ ప్రదేశ్‌‌లో రెడ్ అలెర్ట్
భారీ వర్షాల దెబ్బకి రోడ్లు , స్కూల్స్, కాలేజీలు బంద్

హిమాచల్ ప్రదేశ్‌లో పలుచోట్ల వర్షం, హిమపాతం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రంలో వర్షాలు, ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తున్నందున నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రహదారులను మూసివేశారు. హిమాచల్‌‌లో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. ఈ ప్రాంతం మొత్తం చలిగాలుల్లో చిక్కుకుంది.

హిమాచల్ ప్రదేశ్‌ లోని వాతావరణ శాఖ సిమ్లాతోపాటు పలు చోట్ల వర్షం , హిమపాతం కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. మార్చి 3 వరకు రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేయబడింది. శనివారం అనేక ప్రాంతాల్లో వర్షం, భారీ హిమపాతం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు కులు జిల్లాలో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కులు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను శనివారం మూసివేశారు. అయితే వార్షిక పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. మిగిలిన విద్యాసంస్థలు శనివారం పూర్తిగా మూసివేయబడ్డాయి. భారీగా మంచు కురుస్తుండటంతో జిల్లాలో ట్రాఫిక్‌ స్తంభించింది. అదే సమయంలో పలు రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యాటకుల కోసం అటల్ టన్నెల్ కూడా మూసివేయబడింది.

హిమపాతం కారణంగా సోలాంగ్ నాలాలోని రోడ్లు కూడా మూసుకుపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించింది. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు, ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తున్నందున నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రహదారులను మూసివేశారు. భారీ వర్షాలు, హిమపాతం కారణంగా హిమాచల్‌ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. హిమాచల్‌ ప్రాంతం మొత్తం చలిగాలుల్లో చిక్కుకుంది.

Tags

Read MoreRead Less
Next Story