బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో భారీ హింస.. బాంబు దాడిలో ఏడుగురు మృతి

బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో ఓటింగ్ రోజున భారీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్దాలో ఘర్షణలు నెలకొనడంతో ఏడుగురు మృతి చెందారు. విస్తృతమైన హింసాత్మక ఆందోళనల మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కీలకమైన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేక హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్ జరుగుతుండగా ఎన్నికల సంబంధింత హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. టిఎంసికి చెందిన నలుగురు కార్యకర్తలు చనిపోగా, కూచ్ బెహార్‌లో ఒక బిజెపి పోలింగ్ ఏజెంట్‌ను కాల్చి చంపారు. ఘర్షణల్లో గాయపడిన సీపీఎం కార్యకర్త కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీల మధ్య స్థానిక పరిపాలన నియంత్రణ కోసం తీవ్రమైన పోరు జరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
బెంగాల్‌లో ఓటింగ్ జరుగుతుండగా మాల్దాలో క్రూడ్ బాంబులు పేలాయి. మాల్దాలోని రతువా చాంద్‌మోని ప్రాంతంలో క్రూడ్‌బాంబింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లపై కాంగ్రెస్ నాయకుడు నజీర్ అలీ నేతృత్వంలో అగంతకులు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో మెజరుల్ హక్ అనే యువకుడు గాయపడ్డాడు. అతడి శరీరమంతా గాయాలయ్యాయి. అతడిని మాల్డా మెడికల్‌కు తీసుకువస్తున్నారు. కేంద్ర బలగాలు బూత్‌లో లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com