Kedarnath: గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.... హెలీప్యాడ్‌కు 100 మీటర్ల దూరంలో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ వెనక భాగం దాదాపు నేలను ఢీకొన్న క్రమంలో పైలట్ అప్రమత్తత వల్ల యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
పవిత్ర చార్‌ధామ్ యాత్ర లో ఒకటైన కేదార్‌నాథ్ కు బయల్దేరిన యాత్రికులకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తత వల్ల యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కేస్ట్రల్ ఏవియేషన్‌కు చెందిన హెలీకాప్టర్ యాత్రికులతో సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌లో వెనక మోటార్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేలపై ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ చేసే క్రమంలో హెలికాప్టర్ వెనక భాగం కొద్దిగా నేలను తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్‌ను బయట నుంచి చూస్తున్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి పరుగులు తీశారు. హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శనం తర్వాత యాత్రికులను తిరిగి పంపామని పేర్కొన్నారు. సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సివచ్చిందనీ...ఘటనపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com