INDIAN ARMY: మాకు సహకరించండి: ఇండియన్‌ ఆర్మీ

INDIAN ARMY: మాకు సహకరించండి: ఇండియన్‌ ఆర్మీ
మణిపూర్‌ ప్రజలకు ఇండియన్‌ ఆర్మీ విజ్ఞప్తి... శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని వినతి...

హింసతో అతలాకుతలమైన మణిపూర్‌లో శాంతి నెలకొల్పి సాధారణ పరిస్థితులను తెచ్చేందుకు తమకు సహకరించాలని భారత సైన్యం విజ్ఞప్తి చేసింది. శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరింది. మణిపూర్‌లో మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ విధులను అడ్డుకుంటున్నారని.. భద్రతా దళాల కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్మీ తెలిపింది. ఇతం గ్రామంలో 12 వందల మంది మహిళల నేతృత్వంలోని బృందం.. తమను చుట్టుముట్టి 12 మంది మిలిటెంట్లను విడిపించుకుపోయిన వీడియోను ఆర్మీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. మణిపూర్‌లోని మహిళా కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తమ విధులను అడ్డుకుంటున్నారని ఆ వీడియోలో పోస్ట్‌ చేసింది. ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు క్లిష్ట పరిస్థితుల్లో భద్రతా బలగాలు సమయానుకూలంగా స్పందిస్తున్నాయని... కానీ ఈ అనవసర జోక్యం చాలా హానికరమని భారత సైన్యం హెచ్చరించింది. శాంతి పునరుద్ధరణలో తమ ప్రయత్నాలకు మద్దతివ్వాలని అన్ని వర్గాల ప్రజలకు ఇండియన్‌ ఆర్మీ విజ్ఞప్తి చేసింది. మానవీయ దృష్టితో.. క్లిష్ట పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకొని మిలిటెంట్లను వదిలి పెట్టిన ఇన్‌ఛార్జ్ కమాండర్‌ను ఆర్మీ ప్రశంసించింది. మణిపూర్‌లోని ఇతం గ్రామంలో స్థానిక మహిళల నేతృత్వంలో ఓ గుంపు భారత సైన్యాన్ని చుట్టుముట్టి 12 మంది మిలిటెంట్లకు అండగా నిలిచారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య సైన్యం 12 మంది మిలిటెంట్లను వదిలేసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. తమను అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఇలా కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని ఆర్మీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమనిగింది. సైన్యానికి పట్టుబడిన మిలిటెంట్లలో తనకు తాను లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ప్రకటించుకున్న మొయిరాంగ్తెమ్‌ తంబా అలియాస్‌ ఉత్తమ్‌ ఉన్నాడు. ఇతడిని ‘వాంటెడ్‌ టెర్రరి్‌స్ట’గా ప్రకటించారు. ఈ మిలిటెంట్ల గ్రూప్‌ మయన్మార్‌ నుంచి భారత్‌లోకి చొరబడిందని సైనిక వర్గాల సమాచారం. మొయిరంగథెం తంబా 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనే ఘటనల్లో సూత్రధారి. మిలిటెంట్లను అరెస్ట్ చేసిన ఇతం గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల కారణంగా మైటీ వర్గానికి చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ కంగ్లీ యావోల్‌ కన్నా లుప్‌ సభ్యులు తప్పించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story