Veerendra Heggade: రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వీరేంద్ర హెగ్డే గురించి ఆసక్తికర విషయాలు..

Veerendra Heggade: 1948 నవంబర్ 25న దక్షిణ కర్ణాటకలోని భంత్వాల్‌లో జన్మించారు వీరేంద్ర హెగ్డే. 19వ ఏటే ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారిగా నియమితులయ్యారు వీరేంద్ర హెగ్డే. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని, ఎంతోమంది నిస్సహాయులకు అండగా నిలిచినందుకు గానూ వీరేంద్రకు పలు అవార్డులు కూడా దక్కాయి. వాటితో పాటు 2009లో కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డును కూడా అందుకున్నారు వీరేంద్ర హెగ్డే.
ధర్మాధికారిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వీరేంద్ర హెగ్డే. శ్రీ క్షేత్ర ధర్మస్థలంలో సామూహిక వివాహాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1972లో ప్రారంభించిన ఈ స్కీంలో ఇప్పటివరకు 10,000 జంటల వివాహం చేశారు. అంతే కాకుండా ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజీలో పీజీ కోర్సును ప్రవేశపెట్టారు. కర్ణాటక వ్యాప్తంగా ఎన్నో అడ్వాన్స్ స్కూళ్లను, కాలేజీలను కూడా ప్రారంభించారు.
వీరేంద్ర హెగ్డే సామాజిక సేవలను గుర్తించిన ప్రభుత్వం 2000లో ఆయనకు పద్మ భూషణ్‌ను కూడా ఇచ్చింది. వీరేంద్ర సామాజిక కార్యక్రర్త మాత్రమే కాదు రైటర్ కూడా. ఇప్పటికీ ఆయన మంజువాణి అనే మాస పత్రికను ప్రచురిస్తూ ఉంటారు. దీంతో పాటు పలు ప్రచరణలు కూడా ఆయన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికీ తనవంతు కృషి చేస్తూనే ఉన్నారు వీరేంద్ర హెగ్డే. 'రూరల్ ఇండియా రూల్ ఇండియా' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com