CJI NV Ramana: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురించి ఆసక్తికర విషయాలు..

X
By - Divya Reddy |26 Aug 2022 2:37 PM IST
CJI NV Ramana: వ్యవసాయ కుటుంబంలో పుట్టారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
CJI NV Ramana: వ్యవసాయ కుటుంబంలో పుట్టారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
- కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జననం
- గణపతిరావు, సరోజిని దంపతుల సంతానం
- కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం
- అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్ కాలేజీలో బీఎస్సీ
- 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం
- 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాద వృత్తి
- 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం
- 2013లో ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పదవి
- 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకం
- 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టుకు పదోన్నతి
- 2021 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకం
- 2022 ఆగస్ట్ 5న ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
- హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్
- అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదనలో ప్రత్యేకత
- ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా వాదనలు
- 13 ఏళ్ల కాలంలో దాదాపు 60వేల కేసుల పరిష్కారం
- పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా సేవలు
- కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు
- దేశ, విదేశాల్లో పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగం
- ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా సేవలు
- రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సేవలు
- జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ
- మాతృభాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై ఆవేదన
- ఇంగ్లీష్ వస్తేనే అభివృద్ధి చెందుతామన్నది అపోహేనని వ్యాఖ్య
- ముస్లిం రిజర్వేషన్ల కేసు విచారణ ధర్మాసనంలో ఒకరిగా జస్టిస్ రమణ
- ముస్లిం రిజర్వేషన్ల కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో విభేదించిన జస్టిస్ రమణ
- రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలని వాదన
- చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని తీర్పులు
- ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూలో 4జీ సేవలు అందించాలంటూ తీర్పు
- పదవీ కాలం చివరి రోజున ఐదు కీలక కేసుల్లో తీర్పు
- తొలిసారి సుప్రీంకోర్ట్ సెర్మోనియల్ బెంచ్ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com