కాలేజీలో 'హిజాబ్' నిషేధం.. రిజైన్ చేసిన అధ్యాపకురాలు

తరగతి గదిలో పాఠాలు చెప్పేటప్పుడు హిజాబ్ ధరించవద్దని ఇన్‌స్టిట్యూట్ అధికారులు ఆరోపించిన సంఘటనతో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేట్ లా కాలేజీలో ఉపాధ్యాయురాలు రాజీనామా చేసింది. అయితే, ఈ విషయం పబ్లిక్‌గా మారి పెద్ద దుమారాన్ని రేపడంతో, కాలేజీ అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలిని తిరిగి పాఠశాలకు హాజరవమంటూ రిక్వెస్ట్ లెటర్ పంపించారు.
ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకుని జూన్ 11న తిరిగి వస్తుందనే హామీని ఇచ్చారు తరగతి విద్యార్ధులకు. గత మూడు సంవత్సరాలుగా LJD లా కాలేజీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న సంజిదా ఖాదర్ జూన్ 5న రాజీనామా చేశారు. మే 31 తర్వాత పనిలో హిజాబ్ ధరించకూడదని కళాశాల అధికారుల నుంచి ఆమెకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆమె కలత చెంది రాజీనామా చేశారు. పాలకమండలి నా విలువలు మరియు మతపరమైన మనోభావాలను కించపరిచింది" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆమె రాజీనామా కళాశాలలో కీలక అంశంగా మారిన తర్వాత, కళాశాల అధికారులు ఆమెను సంప్రదించారు. ఇది కేవలం తప్పుగా అర్ధం చేసుకోవడమే అని నొక్కి చెప్పారు . పనివేళల్లో తల కప్పుకోవడాన్ని తాము ఎప్పుడూ నిషేధించలేదని స్పష్టం చేశారు.
"సోమవారం కార్యాలయం నుండి నాకు మెయిల్ వచ్చింది. నేను నా తదుపరి దశలను విశ్లేషించి, ఆపై నిర్ణయం తీసుకుంటాను. ఫ్యాకల్టీ సభ్యులందరికీ డ్రెస్ కోడ్ ఎప్పటికప్పుడు సమీక్షించబడుతుందని మెయిల్ లో స్పష్టం చేసింది కాలేజీ యాజమాన్యం. బోధించేటప్పుడు తలపై కప్పుకోవడానికి దుపట్టా లేదా కండువాను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఆమెకు ఉందని అందులో పేర్కొంది.
కళాశాల పాలకమండలి ఛైర్మన్ గోపాల్ దాస్ పిటిఐతో మాట్లాడుతూ, "ఎటువంటి నిషేధం లేదు, కళాశాల అధికారులు ప్రతి ఒక్కరి మతపరమైన మనోభావాలను గౌరవిస్తారు. ఆమె మంగళవారం నుండి తరగతులకు హాజరవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మేము ఆమెతో సుదీర్ఘ చర్చలు జరిపాము. ఆమెకు తప్పుడు సమాచారం అందండం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఛైర్మన్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com