ADANI: అదానీ గ్రూప్‌పై మరో పిడుగు

ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన వ్యాపార సంస్థలను (Billionaire Gautam Adani's group)మరోసారి ఆరోపణలు( fresh allegations) చుట్టుముట్టాయి. హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల దుమారం పూర్తిగా మరుగునపడకముందే అదానీ గ్రూపును మరోసారి వివాదాలు చుట్టుముట్టాయి. గ్రూపు ప్రమోటర్లకు చెందిన వ్యక్తులే విదేశీ సంస్థల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారని( millions of dollars) ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (Organised Crime and Corruption Reporting Project) ఆరోపించింది. ఈ మేరకు కొన్ని ఆధారాలు లభించినట్లు వెల్లడించింది.
అదానీ గ్రూపు ప్రమోటర్ కుటుంబంతో(Adani family ) భాగస్వామ్యం ఉన్న నాసర్ అలీ షాబాన్ అహ్లీ(Nasser Ali Shaban Ahli), ఛాంగ్ చుంగ్ -లింగ్(Chang Chung-Ling ).. మారిషస్‌కు చెందిన గుర్తు తెలియని ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్స్ ద్వారా వందలాది మిలియన్ల డాలర్లు( hundreds of millions of dollars ) అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టి లబ్ధి పొందారని OCCRP ఆరోపించింది. పన్నులు తక్కువగా ఉండే పలు దేశాల్లో పత్రాలు, అదానీ గ్రూప్ అంతర్గత ఈ-మెయిళ్లను పరిశీలించి ఈ నిర్దరణకు వచ్చినట్టు OCCRP తెలిపింది.
ఈ ఇద్దరు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన కంపెనీల్లో డైరెక్టర్లు, వాటాదారులుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఇదే నిజమైతే కంపెనీ లోపలి భాగస్వాములే 75 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకున్నట్లు అవుతుందని OCCRP తెలిపింది. ఇది భారత లిస్టింగ్ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అహ్లీ, చాంగ్, అదానీ కుటుంబం నుంచి తీసుకున్న డబ్బులనే పెట్టుబడి పెట్టారనేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్న OCCRP.. అదానీ స్టాక్స్ లో వారి కుటుంబ సభ్యుల సమన్వయంతోనే.... ట్రేడింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయని పేర్కొంది.
ఈ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ నివేదికలో పేర్కొన్న అంశాలనే OCCRP కూడా వల్లెవేసిందని విమర్శించింది. OCCRP ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థలన్నీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది. జార్జ్ సోరోస్ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్‌లు విదేశీ మీడియాలోని ఒక విభాగం మద్దతుతో చేస్తున్న కుట్రగా కనిపిస్తోందని అదానీ గ్రూపు పేర్కొంది. ఇప్పటికే వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్నసమయంలో మళ్లీ ఆరోపణలు రావడంపై అనుమానం వ్యక్తంచేసింది. ప్రస్తుతం జరుగుతున్న న్యాయ ప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com