Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా లండన్ ఆసుపత్రిలో మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పిలువబడే ఆయన 1950లో కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కంపెనీని ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుంచి ఒక అంతర్జాతీయ కంపెనీగా మార్చారు. ఈయన నలుగురు హిందూజా సోదరుల్లో రెండోవారు. ఈయన అన్న శ్రీచంద్ హిందూజా 2023లో మరణించారు. మిగిలిన ఇద్దరు సోదరులు ప్రకాష్ హిందూజా, అశోక్ హిందూజా.
బాంబే జై హింద్ కళాశాల నుండి పట్టభద్రుడైన గోపీచంద్, వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ, రిచ్‌మండ్ కాలేజీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. హిందూజా గ్రూప్ ఆటోమోటివ్, బ్యాంకింగ్ మరియుఫైనాన్స్, IT, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, పవర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వంటి పదకొండు రంగాలలో వ్యాపారాలను కలిగి ఉంది. అశోక్ లేలాండ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వీరి ప్రముఖ కంపెనీలు. సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2025 ఎడిషన్ గోపీచంద్ హిందూజా కుటుంబాన్ని యూకేలోనే అత్యంత ధనవంతులుగా పేర్కొంది. వీరి ఆస్తులు విలువ 32.3 బిలియన్ పౌండ్లుగా పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

