Fastag Rules: వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

జాతీయ రహదారులపై సాఫీగా ప్రయాణం సాగిపోవడానికి ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల దగ్గర ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రయాణాలు సాగిపోతుంటాయి. అయినా కూడా కొందరు వాహనదారులు ఫాస్టాగ్ ఉన్న కూడా నగదు చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. అయితే ఇకపై అలాంటి ప్రయాణాలు చేసే వారికి కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో నగదుతో ప్రయాణాలు చేయడానికి వీలుండదు.
టోల్‌ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా లేదా ఫాస్టాగ్ ద్వారానే ప్రయాణాలు చెల్లుబాటు అవుతాయి. ఈ రెండు లేకుండా నగదు చెల్లించి వెళ్తామంటే కుదరుదు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా.. రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ వెల్లడించారు.
హైవేలో పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చినట్లుగా ఉమాశంకర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్‌ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులు నిలిపివేసినట్లుగా స్పష్టం చేశారు. టోలింగ్ వ్యవస్థను వేగవంతం, పారదర్శకంగా, నమ్మదగినదిగా చేసినట్లు చెప్పారు. చాలా మంది ఫాస్టాగ్ ఉన్నప్పటికీ నగదే చెల్లిస్తున్నారని.. ఇకపై అలా కుదరదని పేర్కొన్నారు. నగదు చెల్లింపు కారణంగా పండుగ సమయాల్లో… ఆయా ముఖ్యమైన సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి వాహనదారులు తమ ఫాస్టాగ్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించారు. తగినంత బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయాలని కోరారు. భవిష్యత్‌లో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఉండదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

