Himachal Pradesh: సిమ్లా మునిగిపోతుందా..?

Himachal Pradesh: సిమ్లా మునిగిపోతుందా..?
సిమ్లాకు ముప్పు ముంపు పొంచి ఉందన్న హెచ్చరికలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు(HEAVY RAINS) హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో సిమ్లా జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సిమ్లా(SIMLA) జిల్లాలోని నంఖారి, కోట్ ఘర్ ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉందని( Shimla at risk) అధికారులు హెచ్చరించారు. సిమ్లాలోని రాంపూర్ ప్రాంతంలో వర్షాలకుకొండచరియలు విరిగిపడి సిమ్లా-కిన్నౌర్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.


జెరోయి ప్రాంతంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారి(HIGHWAY_పై 5పై రాకపోకలు నిలిపివేశారు.కులు జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో మేఘాల విస్పోటనంతో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. హిమాచల్ లో ఇప్పటివరకు వరదల కారణంగా 187 మంది మరణించారని, మరో 34 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఆగస్టు 2న మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో హిమాచల్‌ వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు వెల్లడించారు.


2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విపత్తు నిధులు రూ.315 కోట్లను ఇవ్వాల్సిందిగా హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనావేశామని స్పష్టం చేశారు. వరదలతో సంభవించిన రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించింది. ప్రధాన రహదారులు, లింక్ రోడ్లతో సహా 1,300 రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.


హిమాచల్‌లోని తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ (Sukhvinder Singh Sukh) ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రతి జిల్లాలోనూ మంత్రులు ఉంటూ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సమాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story