Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
X
రూ.49 కోట్ల విలువ చేసే 49 కేజీల గంజాయి సీజ్

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా… భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టం చేసినా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిఘా అధికారులు డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నా గంజాయి స్మగ్లింగ్ ఆగడం లేదు. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.49 కోట్ల విలువ చేసే 49 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన స్మగ్లర్ల దగ్గర గంజాయి సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను కేటుగాళ్లు బురిడీ కొట్టించేందుకు గంజాయిని లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే యత్నం చేశారు. స్మగ్లర్స్ ఎత్తులను అధికారులు చిత్తు చేశారు. లగేజ్ బ్యాగ్‌లో దాచిన గంజాయిను గుట్టు రట్టు చేశారు. బట్టలతో పాటు గంజాయిను భద్రపరిచారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story