ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 130 గుడిసెలు దగ్ధం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 130 గుడిసెలు దగ్ధం
ఢిల్లీలోని షహబాద్ డెయిరీకి సమీపంలోని మురికివాడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరగడంతో 130 మంది గుడిసెలు దగ్ధమయ్యాయి.

ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. శనివారం రాత్రి కూడా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని షహబాద్ డెయిరీ ప్రాంతానికి సమీపంలోని మురికివాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో 130 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10.17 గంటలకు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు ఒక కాల్ వచ్చింది. 15 అగ్నిమాపక యంత్రాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాయి.

గంటల తరబడి శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ భారీ అగ్నిప్రమాదంలో 130 గుడిసెలు దగ్ధమైనట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారులు ధృవీకరించారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Read MoreRead Less
Next Story