Logics Mall Noida Fire : నోయిడా సెక్టార్ 32లో భారీ అగ్నిప్రమాదం

నోయిడా లాజిక్స్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాల్‌లో అగ్నిప్రమాదం కారణంగా గందరగోళ వాతావరణం నెలకొంది. మంటలు చెలరేగిన వెంటనే మాల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. మంటలు వ్యాపించక ముందే ప్రజలు బయటకు వచ్చారు. మాల్‌లోని ఓ దుస్తుల షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో మాల్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రస్తుతం పలు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నోయిడాలోని సెక్టార్ -24 పోలీస్ స్టేషన్ పరిధిలోని లాజిక్స్ మాల్ లోపల ఉన్న ఒక బట్టల షోరూమ్‌లో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ సెక్టార్ 24 పోలీస్ ఫోర్స్, అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మాల్‌లో పొగలు కమ్ముకోవడంతో అందరినీ బయటకు పంపించేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ప్రస్తుతం మాల్ లోపల ఎవరూ చిక్కుకోలేదు. మాల్‌లో పొగలు కమ్ముకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తొలిదశలో మంటలను ఆర్పేందుకు మాల్ యాజమాన్యం ప్రయత్నించగా, మంటల పరిధి పెరగడంతో పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మాల్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com