Brij Bhushan :కౌగిలించుకోవడం తప్పు కాదన్న బ్రిజ్ భూషణ్

మహిళా రెజ్లర్లను కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.లైంగిక వేధింపుల ఆరోపణలపై కోర్టు కు హాజరైన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనను తాను గట్టిగా సమర్థించుకున్నారు. నేరపూరిత, లైంగిక ఉద్ధేశం లేకుండా స్త్రీని తాకడం నేరం కాదన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళా రెజ్లర్లు కొందరు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఆరోపణలపై కేసు నమోదైంది. కేసును విచారిస్తున్న డిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా రెజ్లర్ల ఆరోపణలకు కాలపరిమితి లేదన్నారు.
ఫిర్యాదుల సమయం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. 2017, 2018సంవత్సరాల్లో జరిగిన ఆరోపించిన సంఘటనల ఆధారంగా 2023లో ఫిర్యాదు దాఖలైందని పేర్కొన్నారు. ఈ ఆలస్యానికి కెరీర్ అనే భయం తప్పితే బలమైన కారణమేదీ వారు చెప్పకపోవడం గమనార్హం అన్నారు. రెజ్లింగ్ ఈవెంట్‌లలో ఎక్కువగా మగ కోచ్‌లు ఉంటారని, విజయం కోసం మహిళా రెజ్లర్లను మగ కోచ్ కౌగిలించుకోవడం సాధారణమేనన్నారు. అయినా మంగోలియా, జకార్తాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరిగినట్టు ఆరోపించారని, అవి ఇండియాలో జరగలేవు కాబట్టి, ఇక్కడ విచారించరాదని అన్నారు. అలాగే కర్ణాటకలోని బళ్లారి లేదా యూపీలోని లక్నోలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీలో విచారణ జరపడం సాధ్యం కాదని చెప్పారు. దీనిపై కోర్టు గురువారం విచారణ కొనసాగించనుంది. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 20న బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రిజ్ భూషణ్ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com