West Bengal: భార్య ఉద్యోగం చేయడం నచ్చక చేయి నరికేసిన భర్త.. అయినా కూడా..

West Bengal: భార్య ఉద్యోగం చేయడం నచ్చక చేయి నరికేసిన భర్త.. అయినా కూడా..
West Bengal: రేణుక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షేర్.. తన ఇద్దరు అనుచరులతో కలిసి రేణుకపై దాడి చేశారు.

West Bengal: ఆడ, మగ.. ఇద్దరూ సమానమే.. ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నారు. ఇద్దరికీ సమానంగా గౌరవం దక్కుతుంది అని ఈరోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ భర్తకంటే భార్య ఎక్కువ సంపాదిస్తే నేరం అని భావించే వ్యక్తులు కూడా ఉన్నారు. భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తుందని, మంచి ఉద్యోగం పొందిందని తట్టుకోలేని ఓ శాడిస్ట్ భర్త.. దారుణానికి ఒడిగట్టాడు.

పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బురుద్వాన్ జిల్లాలో కేటుగ్రామ్‌లో షేర్ మహమ్మద్.. తన భార్య రేణుకా ఖాటూన్ నివాసముంటున్నారు. రేణుకాకు ఎప్పటినుండో నర్స్ అవ్వాలని కోరిక ఉండేది. పట్టుదంతో గవర్నమెంట్ నర్సుగా ఉద్యోగం దక్కించుకుంది. కానీ ఉద్యోగం వచ్చినప్పటి నుండి దానిని రిజెక్ట్ చేయమని భార్యను వేధింపులు మొదలుపెట్టాడు షేర్. కానీ రేణుకా వినలేదు. దీంతో తనను ఎలాగైనా ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఆపాలి అనుకున్నాడు.

రేణుక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షేర్.. తన ఇద్దరు అనుచరులతో కలిసి రేణుకపై దాడి చేశారు. రేణుకా అరవకుండా తన మొహానికి దిండు అడ్డంగా పెట్టి తన కుడి చేతిని నరికేశాడు. ఆ తర్వాత స్పృహ తప్పిపోయిన రేణుకను తనే స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు షేర్. అంతే కాకుండా నరికేసిన చేతిని మళ్లీ అతికించే అవకాశం లేకుండా ఇంటి వద్దే వదిలేశాడు.

రేణుకకు స్పృహ వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యలకు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షేర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. చేయి నరికేసినా కూడా తన కలను నెరవేర్చుకోవాలి అనుకున్న రేణుక.. నర్సు ఉద్యోగంలో చేరడానికి సిద్ధపడింది.

Tags

Read MoreRead Less
Next Story