CM Mamata Banerjee: నేను బ్రతికున్నంత వరకు బెంగాల్ లో ఎవరికీ ఉద్యోగాలు పోవు..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపై ఈరోజు (ఏప్రిల్ 7న) ఆ నియామక టీచర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను బ్రతికి ఉన్నంత వరకు ఎవరూ కూడా తమ ఉద్యోగాలను కోల్పోలేరని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది.. నేను మాట్లాడిన తీరుపై తనను జైలులో వేసే ఛాన్స్ ఉంది.. ఎవరైనా తనకు సవాల్ విసిరితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను అన్నారు.. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
ఇక, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల 25,753 మంది టీచర్లతో పాటు ఇతర సిబ్బందిని నియమించింది. కానీ, ఆ నియామకాలను సుప్రీంకోర్టు గత గురువారం నాడు రద్దు చేసింది. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సీజేఐ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ రద్దు చేసిన ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియను చేపట్టి.. వచ్చే 3 నెలల్లో పూర్తి చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com